కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శలు చేశారు. కరోనా కష్టకాలంలో ఆదుకోవాల్సింది పోయి పనికిరాని ప్యాకేజీ ప్రకటించారని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా నిత్యావసరాలను మంత్రి అందించారు.
కరోనా ఇప్పట్లో పోయేలా లేదని అందరూ జాగ్రత్తలు పాటిస్తూ జీవించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు.