తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కేసీఆర్​... తెలంగాణ గాంధీ: ఎర్రబెల్లి - Cm kcr birthday news

సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం హనుమాన్​నగర్, జామా తండాలో పర్యటించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు. పల్లె నిద్ర చేసిన మంత్రి ఉదయం లేవగానే లుంగీ... బనియన్​పై తండాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు

సీఎం కేసీఆర్​... తెలంగాణ గాంధీ: ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్​... తెలంగాణ గాంధీ: ఎర్రబెల్లి

By

Published : Feb 17, 2021, 2:27 PM IST

తెలంగాణ కోసం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్... తెలంగాణ గాంధీ అని కొనియాడారకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం హనుమాన్​నగర్, జామా తండాలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్​లతో కలిసి కేక్ కట్ చేసి పెద్దఎత్తున మొక్కలు నాటారు.

వేప పుల్లతో పండ్లు తోముకుంటూ.... స్వయంగా ద్విచక్ర వాహనం తోలుకుంటూ అందరినీ పలకరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిరప కల్లాల వద్ద కూర్చొని మిరప రైతుల యోగక్షేమాలు, పంట పొలాల వద్ద రైతుల యోగక్షేమాలను, పంటల దిగుబడి తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఆర్ఎస్పీ కాలువలో ముఖం కాడుకున్నారు.

రైతు వేదిక ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేశారు. రాత్రి హనుమాన్ నగర్ తండాలో పల్లెనిద్ర చేసిన మంత్రి ఉదయం లేవగానే లుంగీ ... బనియన్​పై తండాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

సీఎం కేసీఆర్​... తెలంగాణ గాంధీ: ఎర్రబెల్లి

ఇదీ చూడండి:'కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ'

ABOUT THE AUTHOR

...view details