మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి గ్రామంలో రైతు వేదిక భవనానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాఠోడ్భూమి చేశారు. అనంతరం ఆరో విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. జిల్లాలో మొత్తం 82 రైతు భవన నిర్మాణాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు.
భాజపావి చిల్లర రాజకీయాలు: మంత్రి ఎర్రబెల్లి - Minister Erraballi Fires on BJP Leaders latest news
రాష్ట్ర భాజపా నాయకులు చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. కేంద్రం వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానించకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
భాజపావి చిల్లర రాజకీయాలు
తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు. భాజపా నాయకులు చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని విమర్శించారు. కేంద్రం వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానించకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ వ్యవసాయంతో అనుసంధానం చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.