Maoist Sharadakka: మావోయిస్టు నేత శారదక్క లొంగుబాటు - తెలంగాణ వార్తలు
09:05 September 17
మావోయిస్టు నేత శారదక్క లొంగుబాటు
మావోయిస్టు నాయకురాలు శారదక్క జనజీవన స్రవంతిలో కలిశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శారదక్క డీజీపీ ఎదుట లొంగిపోయారు. మహబూబాబాద్ జిల్లా గంగారానికి చెందిన శారదక్క 1994లో పీపుల్స్ వార్ పార్టీకి ఆకర్షితులై అజ్ఞాతంలోకి వెళ్లారు. గతంలో చర్ల-శబరి ఏరియా కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలి హోదాలో ఉన్నారు.
మావోయిస్టు తెలంగాణ కార్యదర్శిగా పనిచేసిన హరిభూషణ్కు శారద భార్య. జూన్ 21వ తేదీన హరిభూషణ్ కరోనాబారిన పడి మృతి చెందారు. ఆ సమయంలో శారత సైతం కరోనాబారిన పడ్డారు. ఆమె తీవ్ర అస్వస్థకు గురై క్రమంగా కోలుకున్నారు.
ఇదీ చూడండి:AOB: ఏవోబీలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు