ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. మహబూబాబాద్ లోక్సభ తెరాస అభ్యర్థి మాలోత్ కవిత బయ్యారంలో ప్రచారం నిర్వహించారు. మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించి బోనం ఎత్తుకొని ప్రచారం చేపట్టారు. జగ్గుతండలో లంబాడీ మహిళలతో కలిసి నృత్యం చేశారు. సంప్రదాయ పద్ధతిలో కార్యకర్తలతో కలిసి తీన్మార్ ఆడారు. కారు గుర్తుకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజక వర్గంలో నిర్వహించిన రోడ్ షోలో భారీ ఎత్తున తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచారంలో ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.
'కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ రుణం తీర్చుకుందాం' - ఎన్నికల ప్రచారంలో మాలోత్ కవిత
ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నందున అభ్యర్థులు ప్రచారంలో దుసుకుపోతున్నారు. మహబూబాబాద్ లోక్సభ తెరాస అభ్యర్థి మాలోత్ కవిత బయ్యారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ప్రచారం చేశారు.
ఎన్నికల ప్రచారంలో మాలోత్ కవిత