మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాలతో పోలీసులు పట్టణంలోని పలు కాలనీలలో విస్తృత సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలు, 2 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశారు. బెల్ట్ షాప్‌లలో అక్రమంగా నిల్వ ఉన్న సుమారు 10 వేల విలువైన మద్యం సీసాలు, 30 లీటర్ల గుడుంబా, 200 లీటర్ల బెల్లం పానకం, 30 కేజీల నల్ల బెల్లo, 5 వేల విలువైన గుట్కా పొట్లాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వ్యాపారం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సంఘ విద్రోహ శక్తులకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఆశ్రయం కల్పించవద్దని హెచ్చరించారు.
మహబూబాబాద్‌లో పోలీసుల ఆకస్మిక సోదాలు - సీజ్
మహబూబాబాద్‌లోని పలు కాలనీల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రతీ ఇంటినీ సోదాలు చేసి అనుమతి లేని పలు వాహనాలు, అక్రమంగా మద్యం సీసాలు, నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
మహబూబాబాద్‌లో పోలీసుల ఆకస్మిక సోదాలు