రాజకీయ కారణాలతోనే తనను హైదరాబాద్‌కు తనను బదిలీ చేశారని మహబూబాబాద్ సూపరింటెండెంట్ భీంసాగర్ ఆరోపించారు. తన పదవీ విరమణకు ఏడాదికి పైగా సమయం ఉన్నా... అకారణంగా పంపిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.
మంత్రి వేధిస్తున్నారంటూ... ఉన్నతాధికారి కన్నీటి పర్యంతం - తెలంగాణ వార్తలు
స్వార్థ ప్రయోజనాల కోసమే తనను పదోన్నతిపై బదిలీ చేశారని మహబూబాబాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్ భీంసాగర్ ఆరోపించారు. ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న వారు తనకు అన్యాం చేశారని కన్నీటి పర్యంతమయ్యారు.
ఆసుపత్రి అభివృద్ధికి ఏళ్ల తరబడిగా ఎంతో కృషి చేశానని చెప్పారు. సూపరింటెండెంట్ బాధ్యతలు తన వారికి అప్పగించేందుకే ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న వారు తనకు అన్యాయం చేశారని వాపోయారు. సర్వీసులో ఉన్నంత కాలం ప్రజల కోసం పనిచేశానని... స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైంది కాదన్నారు. మహబూబాబాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా ఇప్పటివరకు ఉన్న భీంసాగర్ పదోన్నతిపై వైద్యావిధాన పరిషత్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్‌గా బదిలీ అయ్యారు.
ఇదీ చూడండి:సెల్లు మీదే కళ్లు: మనసు మల్లుతోంది... యమపురి పిలుస్తోంది!