తెలంగాణ

telangana

'లాక్​డౌన్​తో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి'

మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్.. జిల్లా ఎస్పీ, వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో లాక్​డౌన్​ అమలు తీరు, కొవిడ్​ రెండో దశ పరిస్థితులపై చర్చించారు. అనవసరంగా బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

By

Published : May 25, 2021, 10:00 PM IST

Published : May 25, 2021, 10:00 PM IST

mahabubabad covid cases
mahabubabad covid cases

లాక్​డౌన్ వల్ల మహబూబాబాద్ జిల్లాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. అనవసరంగా బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిత్యావసరాలను వారం రోజులకు ఒకేసారి కొనుగోలు చేసుకోవాలని సూచించారు. లాక్​డౌన్​ అమలు తీరు, కొవిడ్​ రెండో దశ పరిస్థితులపై.. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, వైద్యారోగ్యశాఖ అధికారి హరీశ్ రాజులతో కలెక్టరేట్​లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

పలు గ్రామాల్లో పండుగలు, శుభకార్యాల పేరిట ప్రజలు గూమిగూడుతున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జిల్లాలో 450 మంది సిబ్బందితో 13 చెక్ పోస్ట్​లు, 18 పెట్రోలింగ్ బృందాలతో లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన 5,600 మందిపై కేసులు నమోదు చేసి.. 2,100 వాహనాలను సీజ్ చేశామన్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో 3,821 కరోనా కేసులు, 23 మరణాలు

ABOUT THE AUTHOR

...view details