మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని పలు గ్రామాల్లో జడ్పీ ఛైర్పర్సన్ బిందు హరితహారం నిర్వహించారు. ఉప్పలపాడు, లక్ష్మీనరసింహపురం గ్రామాల్లోని శ్మశానవాటిక, డంపింగ్ యార్డు, రహదారికి ఇరువైపులా అధికారులతో కలిసి మొక్కలు నాటారు. వాతావరణంలో వస్తున్న అసాధారణ మార్పుల వల్లే కరోనా లాంటి ప్రాణాంతక జబ్బులు వస్తున్నాయని బిందు తెలిపారు.
'మొక్కలు నాటడమే కాదు... సంరక్షించే బాధ్యతా తీసుకోవాలి'
మొక్కలు నాటి సంరక్షిస్తే అడవుల శాతం పెరిగి వాతావరణ సమతుల్యత ఏర్పడి జబ్బులు మాయమవుతాయని మహబూబాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ వివరించారు. బయ్యారం మండలంలోని పలు గ్రామాల్లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి మొక్కలు నాటారు.
'హరితహారం వల్ల కరోనా లాంటి జబ్బులు మాయవుతాయి'
మొక్కలు నాటి సంరక్షిస్తే అడవుల శాతం పెరిగి వాతావరణ సమతుల్యత ఏర్పడి జబ్బులు మాయమవుతాయని వివరించారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ మధుకర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:భారత్ బయోటెక్‌కు గవర్నర్ తమిళిసై అభినందనలు
TAGGED:
haritha haram program