తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆమెను చంపింది అతడే..ఎందుకంటే..? - మరిపెడ

ఈ నెల 17న మహబూబాబాద్​ జిల్లా ఉల్లేపల్లిలో అనుమానాస్పద స్థితిలో మరణించిన మహిళ కేసును పోలీసులు ఛేరించారు. నిందితున్ని అరెస్ట్​చేసి రిమాండ్​కు తరలించారు.

మహిళ హత్యకేసును ఛేదించిన పోలీసులు

By

Published : May 24, 2019, 7:31 PM IST

మహబూబాబాద్​ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లిలోని ఈనెల 17న అనుమానాస్పదంగా మృతి చెందిన మహిళ కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు వివాహేతర సంబంధాలే కారణమని పోలీసులు నిర్ధరించారు. ఈనెల 17న నిందితుడు హుస్సేన్​ లునావత్​ తండాకు రమ్మని చెప్పి మహిళ తలపై బండరాయితో కొట్టి గాయపరిచాడని పోలీసులు తెలిపారు. అనంతరం కొనఊపిరితో ఉన్న మహిళ మెడకు చున్మి బిగించి హతమార్చినట్లు వెల్లడించారు. నిందితున్ని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించినట్లు తొర్రూరు డీఎస్పీ మదన్​లాల్​ తెలిపారు.

మహిళ హత్యకేసును ఛేదించిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details