తెలంగాణ

telangana

ETV Bharat / state

జిల్లాలో ఘనంగా లింగమంతుల జాతర - ఉప్పరపల్లిలో లింగమంతుల జాతర

మహబూబాబాద్ జిల్లా ఉప్పరపల్లి గ్రామంలో లింగమంతుల జాతర ఘనంగా జరిగింది. ఈ వేడుకలో స్థానిక ఎమ్మెల్యే శంకర్​నాయక్ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

lingamanthula fistivitry glory in mahabubabad district upparapally
జిల్లాలో ఘనంగా లింగమంతుల జాతర

By

Published : Feb 24, 2021, 5:48 PM IST

యాదవుల కులదైవమైన లింగమంతుల స్వామి వారి జాతరను మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్​ నాయక్ పాల్గొన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని వేడుకున్నానని ఆయన తెలిపారు.

జాతరకు పెద్ద సంఖ్యలో హజరైన భక్తులు డప్పు చప్పుల్లతో బోనాలను ఎత్తుకుని గుడికి చేరుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చూడండి:ప్రారంభమైన మేడారం చిన జాతర.. తరలొచ్చిన భక్తులు

ABOUT THE AUTHOR

...view details