గాలివాన దుమారం... ఎగిరిపోయిన పైకప్పులు - houses
గాలివాన సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. నిన్న రాత్రి తొర్రూరు మండలంలో కురిసిన వర్షానికి ఇళ్ల పైకప్పులన్ని ఎగిరిపోయాయి.
గాలి, వాన ధుమారం
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని పలు గ్రామాల్లో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. నిన్న రాత్రి గాలివాన దుమారంతో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రేకులన్నీ నేలమట్టం అయ్యి ధ్వంసమయ్యాయి. కప్పులు ఎగిరిపోవడం వల్ల వర్షపు నీరు ఇండ్లలోకి చేరింది. తినేందుకు వీల్లేకుండా బియ్యం, ఇతర సామగ్రి మొత్తం తడిసిపోయాయి. కరెంటు స్తంభాలు, చెట్లు కూలి ఇళ్ల మీద పడ్డాయంటూ బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.