తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్షపు నీటితో నిండి చెరువును తలపిస్తోన్న తొర్రూర్ బస్టాండ్ - మహబూబాబాద్ జిల్లా తొర్రూర్​లో ప్రయాణికుల ఇబ్బందులు

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్​లో నిన్నటి నుంచి కురిసిన భారీ వర్షానికి బస్టాండ్ మొత్తం జలమయమైపోయింది. దానివల్ల ప్రయాణికులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

full of rain water in thorrur bus stand
వర్షపు నీటితో నిండి చెరువును తలపిస్తోన్న తొర్రూర్ బస్టాండ్

By

Published : Aug 2, 2020, 11:55 AM IST

మహబూబాబాద్ జిల్లా తొర్రర్​లో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ చెరువుగా మారిపోయింది. వర్షపు నీరంతా బస్టాండు ఆవరణలోకి చేరడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండులో నుంచి కనీసం బస్సులు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా పోయింది.

చిన్నపాటి వర్షం కురిస్తేనే వరద నీరంతా బస్టాండులోకి వస్తోందని ప్రయాణికులు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలను తీర్చాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి:గుండె, ఊపిరితిత్తులపై కరోనా దాడి.. రక్తనాళాలపై దుష్ప్రభావం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details