రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ మంత్రి పదవిని అధిష్టించి ఏడాది పూర్తయిన సందర్భంగా మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా తెరాస నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బిందు.. 200 మంది రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఆసుపత్రిలో 200 మంది రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్ల పంపిణీ
మంత్రి సత్యవతి రాఠోడ్ మంత్రి పదవిని అధిష్టించి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా తెరాస నేతలు, కార్యకర్తలు.. ఆసుపత్రిలో జడ్పీ ఛైర్పర్సన్ బిందు.. 200 మంది రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్ల పంపిణీ
క్యాబినెట్లో మొదటి గిరిజనురాలికి మంత్రి పదవిని అధిష్ఠించడం అదృష్టంగా భావిస్తున్నట్లు జడ్పీ ఛైర్పర్సన్ బిందు అన్నారు. మంత్రి ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని ఈ స్థాయికి వచ్చారని.. జిల్లాలో యువతను ప్రోత్సహిస్తూ జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని బిందు ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: స్వచ్ఛంద పదవీ విరమణకు ఎస్బీఐ ఉద్యోగులు సిద్ధమేనా?