Three Fire Accidents In Telangana Today : రాష్ట్రవ్యాప్తంగా ఎండలు భగభగమండడంతో.. మూడు చోట్ల భారీ అగ్నిప్రమాదాలు సంభవించాయి. దీంతో భారీగానే ఆస్తి నష్టం జరిగింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక మహాదేవ్ ఇండస్ట్రీలో ఉదయం పొగలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో ధాన్యం, బియ్యం, గన్ని బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.3 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని యజమాని తెలిపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్, రెవెన్యూ, సివిల్ సఫ్లై శాఖల అధికారులు అక్కడకు చేరుకొని, విచారణ చేపట్టారు.
Fire Accident In Rice Mill At Mahbubabad : షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదంతో చెలరేగిన మంటలకు విపరీతమైన గాలులు తోడవడంతో క్షణాల్లోనే ఇండస్ట్రీస్‌లో మంటలు వ్యాపించాయి. ధాన్యం, బియ్యం, గన్ని సంచులు, రైస్ మిల్లు, ఆధునాతన విద్యుత్ మోటార్లు అగ్నికి ఆహుతయ్యాయి. మిల్లులో ఉన్న వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. ఘటనాస్థలానికి చేరుకొని 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. రైస్ మిల్ ముందు భారీగా ఉన్న ధాన్యం బస్తాలకు మంటలు రాకుండా అదుపు చేయగలిగారు. లేనిపక్షంలో ఇంకా భారీగానే ఆస్తి నష్టం యజమాని తెలిపారు. అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినా.. ప్రాణ నష్టం జరగకపోవడంతో మిల్లులో ఉండే కార్మికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.