చరిత్రలో ఏ పాలకులు.. ఏ ప్రభుత్వాలు అన్నం పెట్టే రైతుల గురించి ఆలోచించలేదని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఆమోదించిన రెవెన్యూ బిల్లుకు మద్దతుగా.. కేంద్ర విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే ట్రాక్టర్ను స్వయంగా నడుపుకుంటూ వ్యవసాయ మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా రైతుబిడ్డ కావడంతోనే రైతుల సంక్షేమం కోసం 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటీ 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారని పేర్కొన్నారు.