ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఫకీరాతండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన భూక్యా రామా-ఈర్యా దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్దకుమారుడైన భూక్యా ప్రవీన్ తండా శివారులోని వ్యవసాయ బావికి ఈతకు వెళ్లాడు. ఈత రాని ప్రవీన్ నీటిలో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న తండావాసులు బావి వద్దకు చేరుకుని నీటిలో గాలింపు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. కొడుకు మృతదేహంపై పడి తల్లి రోధిస్తున్న తీరు అక్కడికొచ్చిన వారిని కంటతడి పెట్టించింది.
ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతి - boy dead
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఫకీరాతండాలో ఈతకు వెళ్లి ఓ బాలుడు బావిలో మునిగి చనిపోయాడు.
ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతి