కరోనా మహమ్మారి చిరువ్యాపారుల బతుకు చిత్రాన్నే మార్చివేసిందనడానికి ఇదో ఉదాహరణ. ఈ చిత్రంలో కన్పిస్తున్న వ్యక్తి పేరు గోపి. వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్.
కరోనా కారణంగా మారిన బతుకు ‘చిత్రం’ - మహబూబాబాద్ జిల్లా తాజా వార్తలు
కరోనా వైరస్ కారణంగా అనేక మంది జీవితాలు మారిపోతున్నాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న లాక్డౌన్ నేపథ్యంలో పలు వ్యాపారాలు పూర్తిగా రద్దయ్యాయి. వారి కుటుంబాలు ఉపాధిని కొల్పోయి కూలీలుగా, ఇతర పనులను చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
కరోనా కారణంగా మారిన బతుకు ‘చిత్రం’
మహబూబాబాద్ జిల్లా కొత్తపేటలో నిర్వహిస్తున్న ఫొటోస్టూడియో లాక్‌డౌన్‌తో మూతపడటం వల్ల ఉపాధి కరవైంది. కుటుంబపోషణకు తన ఫొటోస్టూడియో ఎదురుగా కూరగాయల వ్యాపారాన్ని చేపట్టారు.
ఇదీ చూడండి :పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ