తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ ఆస్పత్రిలో డీహెచ్​ఎమ్​వో తనిఖీలు - దంతాలపల్లి

మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్​ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గర్భిణుల వివరాలను నమోదు చేయడంపట్ల నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీఎంహెచ్​వో ఆకస్మిక తనిఖీలు

By

Published : May 25, 2019, 9:09 AM IST

మహబూబాబాద్​ జిల్లా వైద్యాధికారి డా. శ్రీరామ్​ దంతాలపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని పలు రికార్డులు పరిశీలించారు. గర్భిణీల వివరాలను నమోదు చేయడం పట్ల నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బంది తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్​ నెలకు సంబంధించి 94 మంది గర్భిణుల వివరాలు ఆన్​లైన్లో నమోదు చేయాల్సి ఉండగా 44 మంది వివరాలు మాత్రమే ఉన్నాయి. విధులు సరిగా నిర్వర్తించని ఇద్దరు వైద్య అధికారులు, సీహెచ్​తో పాటు సూపర్​వైజర్​, ఏఎన్​ఎంలకు మెమోలు జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వైద్య సిబ్బంది ఆరోగ్య ఉపకేంద్రాలను అందుబాటులో ఉంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని శ్రీరామ్​ కోరారు.

డీఎంహెచ్​వో ఆకస్మిక తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details