మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌ను జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ సందర్శించారు. గ్రామాల నుంచి కూరగాయలను మార్కెట్‌కు ఏ విధంగా తీసుకువస్తున్నారు.. వాటిని తీసుకుని వచ్చే సమయంలో ఎవరైనా ఆపుతున్నారా... ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. కూరగాయలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు. కొనుగోలుదారులు సామాజిక దూరం పాటిస్తూ కూరగాయలను కొనుగోలు చేసే విధంగా చూడాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని.. మాస్కులు లేని వారు ముక్కుకు దస్తీ కట్టుకుని సామాజిక భద్రత పాటించాలని ఆయన కోరారు.
వార్డుకో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలి: కలెక్టర్ వీపీ గౌతమ్ - సామాజిక దూరం
ప్రతి వార్డులో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని వార్డు కౌన్సిలర్లకు మహబూబాబాద్ కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌ను సందర్శించి.. కూరగాయలు తీసుకువచ్చేటప్పుడు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం 23, 24 వార్డులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లను కలెక్టర్ పరిశీలించారు. ప్రతి వార్డులో కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విధంగా చేస్తే ప్రజలెవరూ కూరగాయల కొరకు మార్కెట్ దాకా వెళ్లకుండా ఉంటారని.. తద్వారా ప్రధాన మార్కెట్లో రద్దీ తగ్గుతుందన్నారు. అలాగే వీధుల్లో యాచకులు గాని రోడ్లపై ఉంటున్న అనాథలకు వసతి కల్పించి, భోజన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కౌన్సిలర్లకు ఆయన సూచించారు.
ఇదీ చూడండి:కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి...