మహబూబాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యటించారు. ఆయా గ్రామాల్లో ప్రారంభించిన రైతు వేదికలు, వైకుంఠధామాలు పనులను ఆయన పరిశీలించారు. దంతాలపల్లిలో పల్లె ప్రకృతి వనాన్ని పర్యవేక్షించారు.
'గ్రామాల్లోని అభివృద్ధి పనులను వేగవంతం చేయండి' - మహబూబాబాద్ జిల్లాలో కలెక్టర్ గౌతమ్ పర్యటించారు
గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి, మరిపెడ, ఎల్లంపేట గ్రామాల్లో ఆయన పర్యటించారు.
'గ్రామాల్లోని అభివృద్ధి పనులను వేగవంతం చేయండి'
స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించి వైద్యాధికారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచి ఈ నెలాఖరులోగా వాటిని పూర్తి చేయాలని సూచించారు.
ఇవీచూడండి :రామన్నకు... చిరునవ్వుతో ఓ కానుక