తెలంగాణ

telangana

పోడు భూములను ఆక్రమించిన సర్పంచ్​పై కలెక్టర్​ ఆగ్రహం

పోడు భూములు ఆక్రమించిన వారెవ్వరైనా చర్యలు తప్పవని మహబూబాబాద్​ జిల్లా కలెక్టర్​ వి.పి గౌతమ్​ అన్నారు. జిల్లాలోని కొత్తగూడ, గంగారం మండలాల్లో పర్యటించి పోడు భూములను పరిశీలించారు. కొత్తగూడ మండలం బత్తులపల్లిలో 60 ఎకరాల పోడు భూములను ఆక్రమించిన సర్పంచ్​పై కలెక్టర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

By

Published : Jul 8, 2020, 11:55 PM IST

Published : Jul 8, 2020, 11:55 PM IST

Collector is outraged over the Sarpanch who occupied the Podu lands in mahabubabad district
పోడు భూములను ఆక్రమించిన సర్పంచ్​పై కలెక్టర్​ ఆగ్రహం

ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్​లు... ప్రజలకు సేవ చేయాల్సిందిపోయి పోడు భూములలో సాగు చేసుకోవడంపై మహబూబాబాద్​ జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించి పోడుభూములను పరిశీలించారు. కొత్తగూడ మండలం బత్తులపల్లి గ్రామ సర్పంచ్ ఈసం కాంతమ్మ, ఆమె భర్త ఈసం స్వామితో కలిసి 60 ఎకరాల అటవీ భూముల్లో సాగుచేసుస్తుండటంపై కలెక్టర్ మండిపడ్డారు. భూములను కాపాడే మీరే ఆక్రమించుకుంటే ఎలా అని కలెక్టర్ ప్రశ్నించారు.

సర్పంచ్ నాకు 5గురు పిల్లలు ఉన్నారని సమాధానం చెప్పగా... పిల్లలు ఉంటే అటవీ భూములను అక్రమిస్తారా అని కలెక్టర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ భర్త గూడూరులో వార్డెన్​గా విధులు నిర్వహిస్తున్న ఈసం స్వామికి, సర్పంచ్​కు మెమోలు జారీ చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా సరే పోడుభూములను ఆక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.ఆక్రమించుకున్న అటవీ భూములను తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలని అన్నారు.

ఇవీ చూడండి: మహిళా సంఘాల బలోపేతంతో పల్లెల అభివృద్ధి: మంత్రి హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details