మహబూబాబాద్ జిల్లా గంగారం పీహెచ్సీ వైద్యుడు ముక్రంను సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ అభినందించారు. కొత్తగూడ మండలం పోలారం గ్రామానికి చెందిన గర్భిణి రాత్రి సమయంలో పురిటి నొప్పులు రావడం వల్ల... ఆశా కార్యకర్త, ఏఎన్ఎం... గంగారంలోని ప్రాథమిక వైద్యశాల వైద్యుడికి సమాచారం అందించారు.
పీహెచ్సీ వైద్యుడికి సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ అభినందన - పీహెచ్సీ వైద్య బృందానికి స్మితాసబర్వాల్ అభినందనలు
మహబూబాబాద్ జిల్లా గంగారం పీహెచ్సీ వైద్యుడు ముక్రంను సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ ట్విట్టర్ ద్వారా అభినందించారు. ఏజెన్సీ ప్రాంతంలో రాత్రివేళ పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ప్రసవం చేసిన వైద్యుడిని అభినందించారు.
పీహెచ్సీ వైద్యుడికి సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ అభినందన
వెంటనే స్పందించిన వైద్యుడు ముక్రం తన సొంత వాహనంలో గ్రామానికి వచ్చి గర్భణిని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రసవం చేశారు. ఈ సంగతి తెలిసి జిల్లా కలెక్టర్ వి.పి.గౌతం ట్విట్టర్ ద్వారా వైద్యుడిని అభినందించారు. విషయం తెలుసుకున్న సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ ట్విట్టర్ ద్వారా వైద్య బృందాన్ని అభినందించారు.