భానుడి భగభగకు దంతాలపల్లిలో కారు దగ్ధం - car caught fire at mahabubabad
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో ఓ కారులోంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న యజమాని, అతని పిల్లలు వెంటనే దిగి తమ ప్రాణాలను కాపాడుకున్నాడు. ఎండ తీవ్రంగా ఉండడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో ఓ కారులోంచి పెద్ద ఎత్తున పొగలు చెలరేగిన ఘటనలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల తండాకు చెందిన ఓ కుటుంబం తూర్పుతండాలో జరిగిన దుర్గమ్మ పండుగకు వచ్చారు. ఇవాళ మధ్యాహ్నం కుటుంబమంతా పనుల నిమిత్తం దంతాలపల్లికి వెళ్తున్నారు. అప్పటికే పెరిగిపోయిన ఎండ తీవ్రతకు తోడు కారు వేడెక్కింది. ఒక్కసారిగా కారులోంచి పెద్ద ఎత్తున పొగలు రాగా కారులో ఉన్న వారు వెంటనే దిగి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. స్థానికులు కారుపై నీళ్లు పోసి పొగలను అదుపు చేయడం వల్ల పెనుప్రమాదం తప్పింది.