పని ఒత్తిడి కారణంతో నాగర్ కర్నూలు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శి స్రవంతి, రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సైదయ్యల ఆత్మలకు శాంతి చేకూరాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పంచాయతీ కార్యదర్శులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్ నుంచి నెహ్రూ సెంటర్ వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. ఉద్యోగ భద్రత, మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని నినాదాలు చేశారు.
స్రవంతి, సైదయ్య ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ - పని ఒత్తిడి
జూనియర్ పంచాయతీ కార్యదర్శిలు స్రవంతి, సైదయ్యల ఆత్మలకు శాంతి చేకూరాలని మహబూబాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఉద్యోగ భద్రత, పని ఒత్తిడి తగ్గించాలని పంచాయతీ కార్యదర్శులు నినాదాలు చేశారు.
పంచాయతీ సెక్రటరీల మరణాలపై కొవ్వొత్తుల ర్యాలీ
ఇదీ చూడండి : కల్తీ మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై ఆబ్కారీ కొరడా!