మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరులో ఆకేరు వాగు పొంగిపొర్లుతోంది. శనివారం కురిసిన వర్షానికి వరద నీరు భారీగా చేరడం వల్ల ఆకేరు వాగులో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గుర్తూరు, ఎర్రబెల్లిగూడెం గ్రామాల మధ్య ఈ వాగు ప్రవహిస్తుంది. ఇది చూడడానికి బొగత జలపాతం వలె ఉండడం వల్ల రెండు గ్రామాల ప్రజలు చూడటానికి వస్తుంటారు. ప్రతి ఆదివారం మండలంలోని కొన్ని గ్రామాలకు చెందిన ప్రజలు చూడడానికి వచ్చి సరదాగా గడిపి వెళ్లిపోతుంటారు.
పరవళ్లు తొక్కుతున్న ఆకేరు వాగు... అచ్చం బొగత జలపాతమే..
జోరుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. శనివారం కురిసిన భారీ వర్షానికి మహబూబాబాద్ జిల్లాలోని ఆకేరు వాగు పరవళ్లు తొక్కుతోంది. అచ్చం చూడడానికి బొగత జలపాతం వలె ఉండడం వల్ల ప్రకృతి ప్రేమికులు తరలివస్తున్నారు.
పరవళ్లు తొక్కుతున్న ఆకేరు వాగు... అచ్చం బొగత జలపాతమే..