బక్రీద్ పండుగ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలను చేశారు. రంజాన్ తర్వాత ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగే బక్రీద్. వేకువజామునే స్నానాలు ఆచరించి చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా ఈద్గాలకు చేరుకొని ప్రార్థన చేశారు. అనంతరం తమ తమ ఇళ్లకు చేరుకుని జంతువుని బలి ఇచ్చి బంధుమిత్రులు, పేదలకు పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఈద్గాకు చేరుకొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
త్యాగానికి ప్రతీక బక్రీద్: ఎస్పీ - Mahabubabad District
హజ్రత్ ఇబ్రహీం త్యాగానికి ప్రతీకగా ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటారు. దీనిని ఇస్లాంలో “ఈద్ - ఉల్ - జుహా అని సంభోధిస్తారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
త్యాగానికి ప్రతీక బక్రీద్: ఎస్పీ