సూర్యగ్రహణం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సూర్యోత్సవ్-2019 (సూర్య గ్రహణంపై అవగాహన) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రహణాన్ని వీక్షించేందుకు సోలార్ ఫిల్టర్ గ్లాసులను ఏర్పాటు చేశారు. ప్రజలు వీటి ద్వారా గ్రహణాన్ని వీక్షించారు.
గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూస్తే సూర్యకిరణాలు కంటిపై పడి రెటీనా దెబ్బతింటుందని జన విజ్ఞాన వేదిక సభ్యురాలు సరళా పేర్కొన్నారు. గ్రహణాన్ని ప్రత్యక్షంగా కాకుండా సోలార్ ఫిల్టర్ గ్లాసుల ద్వారా గానీ, ఎక్స్రే ఫిలిమ్స్ ద్వారా గానీ చూస్తే ప్రమాదం ఉండదని తెలిపారు.