బతుకమ్మ చీరల పంపిణీకి మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్డీఏ జిల్లా ఇంఛార్జి పీడీ సూర్యనారాయణ తెలిపారు. సోమవారం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో, మంగళవారం నుంచి గ్రామాల్లో పంపిణీ చేయనున్నట్లు వివరించారు. జిల్లాలో 2లక్షల 82వేల చీరలు అవసరం కాగా.. 2 లక్షల 12 వేల 500 చీరలు వచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటికే మండలాలు, గ్రామాల వారీగా పంపకాలు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి, రేషన్ డీలర్తో వేసిన కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి - arrangements completed sarees distribution
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు అసెంబ్లీ కేంద్రాల్లో, మంగళవారం నుంచి గ్రామాల్లో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి