మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లిలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ సంపెట సుజాత ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. విద్యార్థులకు పలకలు పంపిణీ చేశారు. అనంతరం పూజలు నిర్వహించి... పాఠశాలలో చేరిన విద్యార్థులతో ఒకేసారి సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అధికారులు కోరారు.
బడిబాట కార్యక్రమంలో సామూహిక అక్షరాభ్యాసాలు - schools
మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గంలో వివిధ మండలాల్లో బడి బాట కార్యక్రమాలు ఉత్సాహంగా జరుపుతున్నారు.
సామూహిక అక్షరాభ్యాసాలు