ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకనుగుణంగా పనిచేస్తానని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో మంత్రి సత్యవతికి ఘనస్వాగతం లభించింది. సొంత జిల్లా మహబూబాబాద్‌లో అడుగుపెట్టిన తర్వాత ఘన స్వాగతం లభించటం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. తనపై పెద్ద బాధ్యతను సీఎం పెట్టారని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని మంత్రి తెలిపారు.
సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా: సత్యవతి - మహబూబాబాద్
తెలంగాణ కేబినేట్లో తనకు మొట్టమొదటి మహిళా మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి సత్యవతి రాఠోడ్.
సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా: సత్యవతి