తెలంగాణ

telangana

ETV Bharat / state

అబార్షన్ చేయించబోయాడు.. అడ్డంగా బుక్కయ్యాడు.. - child

అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు..మళ్లీ భార్య గర్భవతి. మూడో కాన్పులోనూ ఆడపిల్లేనా..! ఇదే అనుమానం ఆ భర్తను వెంటాడింది. ఓ ఆర్​ఎంపీ వద్ద అబార్షన్ చేయించేందుకు యత్నించాడు. సీన్ కట్ చేస్తే..కటకటాలపాలయ్యాడు.

అబార్షన్ చేయించబోయాడు..బుక్కయ్యాడు..

By

Published : Jul 7, 2019, 1:43 PM IST

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో దారుణం చోటు చేసుకుంది. మూడో కాన్పులోనూ ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో తన భార్యకు అబార్షన్‌ చేయించాలనుకున్నాడో భర్త. మరిపెడ శివారులోని ఓ తండాకు చెందిన దంపతులకు ఇది వరకే ఇద్దరు ఆడపిల్లలు. ఇప్పుడు ఐదు నెలల గర్భవతి. మళ్లీ ఆడపిల్లే పుడుతుందని భావించిన భర్త స్థానిక ఆర్‌ఎంపీని సంప్రదించాడు. భార్యకు అబార్షన్‌ చేయించేందుకు ప్రయత్నించాడు.

స్థానిక ఆర్​ఎంపీ అప్పటికే ఆమెకు గర్భస్త్రావానికి సంబంధించిన మందులు ఇచ్చాడు. ఇంతలో విషయం తెలుసుకున్న జిల్లా వైద్య సిబ్బంది పోలీసుల సహాయంతో అక్కడికి చేరుకున్నారు. రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. రూ.5 వేలు తీసుకుని అబార్షన్ చేయబోయినట్టు ఆర్‌ఎంపీ ఒప్పుకున్నాడు. ఆర్‌ఎంపీ వైద్యుడితోపాటు మహిళ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అబార్షన్ చేయించబోయాడు

ఇవీ చూడండి: 'మహీ.. మరిన్ని విజయాలతో సాగిపో...'

ABOUT THE AUTHOR

...view details