మహబూబాబాద్ జిల్లా గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. ఏజెన్సీయేతరులకు స్థానికులుగా ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారని తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. మండలంలో 90శాతానికి పైగా ఏజెన్సీ ప్రాంతం ఉన్నందున... ఇతర ప్రాంతాలవారు విద్యా, ఉద్యోగాలలో లబ్ధి పొందుతున్నారని తెలిపారు. తహసీల్దార్‌తో మాట్లాడి న్యాయం చేస్తామన్న పోలీసుల హామీతో ఆందోళన విరమించారు.
నకిలీ ధ్రువపత్రాలిస్తున్నారంటూ తహసీల్దార్‌తో వాగ్వాదం - guduru thahasildar
ఏజెన్సీ ప్రాంతంలో నకిలీ సర్టిఫికెట్స్ ఇస్తున్నారంటూ మహబూబాబాద్ జిల్లా గూడూరు తహసీల్దార్‌తో ఆదివాసీలు వాగ్వాదానికి దిగారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు.
నకిలీ ధ్రువపత్రాలిస్తున్నారంటూ తహసీల్దార్‌తో వాగ్వాదం