కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కొత్త జిల్లా పరిషత్ పాలకవర్గం కొలువుదీరింది. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు జడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా నిర్మించిన ఆర్ అండ్ బీ విశ్రాంతి భవనంలో జడ్పీ ఛైర్మన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా కోవ లక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తదితరులు కోవ లక్ష్మిని ఘనంగా పూలమాలలు, శాలువాలతో సన్మానించారు.
ఆసిఫాబాద్‌లో కొలువుదీరిన జడ్పీ పాలక మండలి
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నూతన జిల్లా పరిషత్ పాలక మండలి ఏర్పటైంది. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హన్మంతు జడ్పీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆర్ అండ్ బి విశ్రాంతి భవనంలో జడ్పీ ఛైర్మన్ కార్యాలయం ఏర్పాటు