తెలంగాణ

telangana

ETV Bharat / state

మిషన్​ భగీరథలో ఇదేం పద్ధతి ?

ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకం అమలు చేస్తోంది తెలంగాణ సర్కారు. సీసీ రోడ్లను పగలగొట్టి భగీరథ పైపులను ఇంటింటికీ అనుసంధానం చేసినా గుంతలు పూడ్చడం మరిచారు.

మిషన్ భగీరథ నిమిత్తం రోడ్డును అడ్డగోలుగా తవ్వారు

By

Published : Mar 15, 2019, 3:00 PM IST

Updated : Mar 15, 2019, 3:57 PM IST

భగీరథ పైపులను ఇంటింటికీ అనుసంధానం చేసి గుంతలు పూడ్చడం మరిచారు
కుమురం భీం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ పట్టణంలోని కాజీనగర్ ​పూర్, సందీప్​నగర్, ఎస్సీ కాలనీల్లో మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్నాయి. రోడ్లను తవ్వి పైపులైన్లు వేసి వాటిని పూడ్చకుండా అలాగే వదిలేశారు అధికారులు.

జిల్లా కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మిషన్ భగీరథ నిమిత్తం రోడ్డును అడ్డగోలుగా తవ్వుతున్నారు. నీటి సరఫరా సమయంలో లీకేజీలు ఏర్పడితే రోడ్లు దెబ్బతింటాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

లక్షల ఖర్చు వృథా

ఇప్పటికైనా అధికారులు స్పందించి తవ్విన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.తాగునీటి సంగతేమో కానీ లక్షల ఖర్చుతో వేసిన రోడ్లు ధ్వంసం చేస్తున్నారని కాలనీ వాసులు వాపోతున్నారు.

ఇవీ చదవండి :మా మంచి దొంగ.. మనసు దోచాడు

Last Updated : Mar 15, 2019, 3:57 PM IST

ABOUT THE AUTHOR

...view details