కుమురం భీం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఏర్పడిన గందరగోళానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్ డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమన్నారు. ప్రభుత్వం పరీక్ష నిర్వహించే ప్రతీసారి న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిరావడం అసమర్థతకు నిదర్శనమన్నారు. విద్యాశాఖ మంత్రి, ఇంటర్‌బోర్డు కార్యదర్శులను పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు, ఓయూ జేఎసీ నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఏ పరీక్ష పెట్టినా.. కోర్టు మెట్లెక్కాల్సి వస్తోంది - inter results
కుమురం భీం జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలకు కారణమైన విద్యాశాఖ మంత్రి, ఇంటర్ బోర్డు కార్యదర్శిని పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఏ పరీక్ష పెట్టినా.. కోర్టు మెట్లెక్కాల్సి వస్తోంది