తెలంగాణ

telangana

ETV Bharat / state

క్షయ వ్యాధి నిర్మూలన కోసం మేము సైతం: విద్యార్థినులు - ASHA WORKERS ANM

దేశాన్ని పీడిస్తున్న క్షయ వ్యాధి నిర్మూలనకు అవగాహనే కీలకమన్నారు వైద్యులు.  వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ చేపట్టారు.

అంతర్జాతీయ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ

By

Published : Mar 25, 2019, 3:18 PM IST

మందుల ద్వారా క్షయ వ్యాధిని తగ్గించుకోవచ్చు : డీఎంహెచ్ఓ బాలు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు​ పట్టణంలోని ప్రధాన వీధుల్లో టీబి అంతం మా పంతం, టీబీ ఓడిపోతుంది భారత్ గెలుస్తుంది అంటూ నినాదాలు చేశారు. పాఠశాల విద్యార్థులు, జిల్లా వైద్యారోగ్య అధికారి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. క్షయ వ్యాధి ప్రాణాంతకమైనప్పటికీ ముందస్తుగా గుర్తించి మందుల ద్వారా తగ్గించుకోవచ్చని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కుమురం బాలు తెలిపారు.డీఎంహెచ్ఓ బాలు వైద్య సిబ్బంది, విద్యార్థినిలతో క్షయ వ్యాధి నిర్మూలన కోసంప్రతిజ్ఞ చేయించారు..

ABOUT THE AUTHOR

...view details