ఆసిఫాబాద్లో తెరాస ఆవిర్భావ దినోత్సవం - trs
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో తెరాస ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పార్టీ జెండా ఆవిష్కరించారు.
కోవా లక్ష్మి
రాష్ట్రవ్యాప్తంగా తెరాస ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. కుమురం భీం ఆసిఫాబాద్లో మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఇంటి ముందు ఆమె పార్టీ జెండా ఎగుర వేశారు. మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.