అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అంతా అంతర్జాలంలోనే సాగుతుందని శిక్షకురాలు చిట్టమ్మ తెలిపారు. నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ శిక్షణలో ప్రతీ కార్యకర్త అంతర్జాల వినియోగంపై అవగాహన కలిగి ఉన్నారని పేర్కొన్నారు. పిల్లల పెరుగుదల, బాలామృతం, కోడిగుడ్ల రేషన్ తదితర వివరాల నమోదు తీరుపై వివరించారు.
అంతర్జాల సాంకేతికపై అంగన్వాడీలకు శిక్షణ
అంగన్వాడీ కార్యకర్తలు సాంకేతిక వినియోగంలో రాణిస్తున్నారు. ప్రతీ అంశం అంతర్జాలంలో నమోదు చేసే శిక్షణ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు. అంతర్జాల వినియోగంతో పని సులువుగా అవడమే కాకుండా వివరాలన్ని అందులో నమోదు చేయగలుతామని అంగన్వాడీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రతీ కార్యకర్త అంతర్జాల వినియోగంపై అవగాహన పెంచుకోవాలి : చిట్టమ్మ
ఇవీ చూడండి :'ఐపీఎస్ సాధించి పేదవారికి సాయం చేస్తా'