తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటు వేయాలంటే.. ఆ జిల్లాలో 150కి.మీ. వెళ్లాలి

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటర్లకు అన్ని వసతులు కల్పిస్తున్నామని ఎన్నికల సంఘం చెబుతోంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యంతో.. వారికి ఇబ్బందులు తప్పడం లేదు.

అధికారుల తప్పిదం వల్ల ఇక్కట్లు పడుతున్న ఉపాధ్యాయులు

By

Published : Mar 22, 2019, 12:43 PM IST

Updated : Mar 22, 2019, 6:27 PM IST

అధికారుల తప్పిదం వల్ల ఇక్కట్లు పడుతున్న ఉపాధ్యాయులు
అధికారుల తప్పిదం వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడాల్సివచ్చింది. కుమురం భీం జిల్లా ఉపాధ్యాయ ఎం.ఎల్.సి ఎన్నికలకు ఉపాధ్యాయ ఓటర్లకు 150 కిలోమీటర్ల దూరంలోని ఇచ్చోడ కేంద్రం కేటాయించడం అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోంది. ఈరోజు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాగజ్ నగర్ కు చెందిన 84 మంది ఉపాధ్యాయులకు స్థానిక పోలింగ్ కేంద్రం కేటాయించకుండా ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ పోలింగ్ కేంద్రం కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

అంతదూరం ఎలా వెళ్లాలి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఉపాధ్యాయులకు ఆసక్తి ఉన్నా.. 150 కిలోమీటర్ల దూరంలోని పోలింగ్ కేంద్రం కేటాయించడం అంటే చాలా వ్యయప్రయాసలతో కూడిందని వాపోయారు.
అధికారుల నిర్లక్ష్యంపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Last Updated : Mar 22, 2019, 6:27 PM IST

ABOUT THE AUTHOR

...view details