తెలంగాణ

telangana

ETV Bharat / state

vultures at Palarapugutta : పాలరాపుగుట్టపై కానరాని రాబందుల జాడ.. అంతరించినట్లేనా? - తెలంగాణ వార్తలు

vultures at Palarapugutta : తెలంగాణలో రాబందులు అంతరించినట్టేనా? దక్షిణ భారతంలో రెండోది, రాష్ట్రంలో ఏకైక స్థావరమైన ఆసిఫాబాద్‌ జిల్లా పాలరాపుగుట్టపై కనుమరుగు అయ్యాయా? వీటిని ఇక జూపార్క్‌లోనే చూడాల్సి ఉంటుందా? క్షేత్రస్థాయి పరిస్థితులు వీటికి అవుననే సమాధానమిస్తున్నాయి.

vultures at Palarapugutta, vultures in telangana
పాలరాపుగుట్టపై కానరాని రాబందుల జాడ

By

Published : Jan 11, 2022, 11:24 AM IST

vultures at Palarapugutta : ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న అరుదైన జాతుల్లో రాబందులు ఒకటి. పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే పక్షులివి. కానీ తెలంగాణలో రాబందులు అంతరించిపోయినట్టేనని క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తే తెలుస్తోంది. వీటిని ఇక జూపార్కుల్లోనే చూడాల్సి రావచ్చని అభిప్రాయం కలుగుతోంది.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పాలరాపుగుట్ట రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధిపొందింది. రాబందుల ఆవాసంగా అటవీశాఖ గుర్తించింది. నూతనంగా ఏర్పడిన కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని దట్టమైన అటవీప్రాంతంలోని ప్రాణహిత, పెద్దవాగు పరివాహకప్రాంతంలో సహజసిద్ధంగా వెలిసిన ఎత్తైన పొడువాటి గుట్టలతో విస్తరించి ఉంది. మహారాష్ట్ర, మధప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వలసవచ్చిన రాబందుల విడదిగా ఉండేది.

వలసవచ్చిన నాలుగైదు రాబందుల సంఖ్య... రెండేళ్ల కిందటనే 23 వరకు పెరగడంతో అప్పట్లో అటవీశాఖ వాటిని రక్షించే ప్రయత్నం చేసింది. కానీ ఆతర్వాత పట్టించుకోకపోవడంతో తిరిగి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం ప్రారంభించాయి. జనారణ్యానికిదూరంగా మనిషి చడీచప్పుడు లేని ఆప్రాంతాన్ని... స్థానిక ఆదివాసీ యువకుడి సాయంతో పెద్దవాగును దాటి మూడు కిలోమీటర్ల కాలినడకన ఈటీవీ-ఈటీవీ భారత్ సందర్శించి... క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించింది. అయితే అక్కడ రాబందుల జాడ కనిపించలేదు. కనుమరుగవుతున్న రాబందుల రక్షణ కోసం అటవీప్రాంతంలో కొన్ని మేలైన సదుపాయాలు కల్పిస్తేనే మేలు.

పాలరాపుగుట్టపై కానరాని రాబందుల జాడ

ఇదీ చదవండి:Niranjan reddy about rythu bandhu : 'మిగిలిపోయిన రైతులకు ఒకట్రెండు రోజుల్లో రైతుబంధు'

ABOUT THE AUTHOR

...view details