తెలంగాణ

telangana

ETV Bharat / state

రహదారిలేక పురిట్లోనే బిడ్డను కోల్పోయిన మాతృమూర్తి - The mother who lost her child

రహదారి లేక ఓ మాతృమూర్తికి తీరని శోఖం మిగిలింది. పురిట్లోనే బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. కుమురంభీం ఆసిఫాబాద్​ పెంచికలపేటలో ఈ విషాదకర ఘటన పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

ట్రాక్టర్​లో కల్పన తీసుకువస్తూ

By

Published : Sep 15, 2019, 3:43 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా పెంచికల పేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. రహదారి లేకపోవడం ఓ మాతృమూర్తికి తీరని దుఃఖం మిగిల్చింది. జిల్లెడకు చెందిన కనక కల్పన అనే గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి. బంధువులు వెంటనే 108కి ఫోన్ చేశారు. జిల్లెడకు రావడానికి రహదారి సరిగా లేదని.. అంబులెన్స్ రాలేదని సిబ్బంది సమాధానం ఇచ్చారు. చేసేదిలేక కుటుంబ సభ్యులు ఒక ట్రాక్టర్ను తీసుకుని గర్భిణీని అందులో ఎక్కించుకుని బెజ్జురు ప్రాథమిక ఆసుపత్రికి బయలుదేరారు. పురిటి నొప్పులు అధికమవడం వల్ల మార్గమధ్యలోనే ప్రసవించింది కల్పన. ప్రసవించిన మహిళను, శిశువును తీసుకుని ఆసుపత్రికి వెళ్లగా పరీక్షించిన వైద్యులు శిశువు మృతి చెందిందని తెలిపారు.

రహదారిలేక పురిట్లోనే బిడ్డను కోల్పోయిన మాతృమూర్తి

ABOUT THE AUTHOR

...view details