కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని ఆర్టీసీ కార్మికులకు కెరమెరి మండలంలోని ఉపాధ్యాయులు 25 వేల రూపాయలు విరాళంగా అందజేశారు. ఆర్టీసీ కార్మికులకు గత రెండు నెలల నుంచి జీతభత్యాలు లేకపోవడం వల్ల కష్టంగా మారిందని తెలుసుకున్న ఉపాధ్యాయులు వీరికి విరాళం అందజేసి ఆదర్శంగా నిలిచారు.
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకు రావాలని ఉపాధ్యాయులు కోరారు. ఆర్టీసీ కార్మికులు బ్రతకడం చాలా కష్టంగా మారిందని... ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులకు మద్దతుగా ఉంటామని తెలిపారు.
ఆర్టీసీ కార్మికులకు ఉపాధ్యాయుల విరాళం - Teachers' donation to RTC workers
ఆర్టీసీ కార్మికులకు గత రెండు నెలల నుంచి జీతభత్యాలు లేకపోవడం వల్ల కష్టంగా మారిందని తెలుసుకున్న ఉపాధ్యాయులు 25 వేల రూపాయలు విరాళం అందజేసి ఆదర్శంగా నిలిచారు.
ఆర్టీసీ కార్మికులకు ఉపాధ్యాయుల విరాళం
ఇవీ చూడండి: పరిహారం కోసం 'సజీవ సమాధి'తో రైతుల నిరసన