కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో.. ఇటీవల జరుగుతున్న పరిణామాలతో తాను పార్టీకి దూరంగా ఉంటున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా.కొత్తపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తనను శ్రమను గుర్తించి.. భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మరోసారి అవకాశమిచ్చిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.
నేనెప్పుడూ భాజపా వ్యక్తినే: కొత్తపల్లి శ్రీనివాస్ - Member of the BJP State Working Committee srinivas
భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మరోసారి తనకు బాధ్యతలప్పగించిన పార్టీ అధిష్ఠానానికి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ నేత కొత్తపల్లి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో చేరిన నాటి నుంచి అంకితభావంతో పనిచేస్తున్న తన శ్రమను అధిష్ఠానం గుర్తించిందని వెల్లడించారు.
భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
పార్టీలోకి ఎవరు వచ్చినా.. వారిని సాదరంగా ఆహ్వానించి భాజపా బలోపేతానికి కృషి చేస్తానని శ్రీనివాస్ చెప్పారు. రానున్న ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి :నిరంకుశ పాలనకు చరమగీతం పాడుదాం: రాంచందర్రావు