కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద ఏర్పాట్లు సరిగా లేకపోవడం వల్ల ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కరించడం లేదని మండిపడ్డారు.
MLA Konappa : టీకా కేంద్రంలో వసతుల లేమి.. సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం - covid vaccination in asifabad district
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడంపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన మెడికల్ ఆఫీసర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సరైన వసతులు కల్పించే వరకు అక్కణ్నుంచి కదిలేదే లేదని ఎమ్మెల్యే భీష్మించుకు కూర్చున్నారు.
కాగజ్నగర్ పట్టణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వ్యాక్సిన్ కేంద్రాన్ని అదనపు పాలనాధికారి రాజేశం సందర్శించారు. అప్పుడే వచ్చిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలను అదనపు పాలనాధికారి దృష్టికి తీసుకువచ్చారు. విధులకు హాజరు కావాల్సిన మెడికల్ ఆఫీసర్ కేంద్రంలో లేకపోవడం, మెడికల్ సిబ్బంది, అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే ప్రజలకు సరైన ఏర్పాట్లు చేసేంత వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఆలస్యంగా వచ్చిన మెడికల్ ఆఫీసర్ అశ్వినిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.