పేదలకు సత్యసాయి సమితి చేయూత - corona effects
లాక్డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు కుమురం భీం జిల్లా కాగజ్నగర్ సత్య సాయి సేవ సమితి సభ్యులు చేయుతనిస్తున్నారు. పట్టణంతో పాటు పల్లెల్లోనూ నిత్యవసరాలు అందజేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
పేదలకు సత్యసాయి సమితి చేయూత
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ న్యూకాలనిలోని పేదలకు సత్యసాయి సేవ సమితి ఆధ్వర్యంలో నిత్యవసరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ఎస్సైలు రవి కుమార్, గంగన్న ప్రజలకు సరుకులు అందించారు. పట్టణంతో పాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో 200 కిట్లు పంపిణీ చేసినట్లు సేవ సమితి సభ్యులు తెలిపారు.