కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రహదారి, చౌరస్తా విస్తరణ పనులు ముందుకు సాగకపోవటం వల్ల పట్టణవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. రెండేళ్ల క్రితమే పట్టణ ప్రజల సౌకర్యార్థం చౌరస్తాలతో పాటు రహదారులు విస్తరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పట్టణంలోని రాజీవ్‌గాంధీచౌక్, ఎన్టీఆర్‌చౌక్, శ్రీకాంతాచారిచౌక్ విస్తరణ కోసం రూ. 30 లక్షల నిధులు కేటాయించారు. రాజీవ్ గాంధీ చౌరస్తా ఓవర్ బ్రిడ్జి ఇతర ప్రాంతాల్లో కొలతలు కూడా చేపట్టారు.
విస్తరణకు నోచుకోని రహదారులు... ట్రాఫిక్‌తో ఇబ్బందులు - kagaznagar news
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని పలు చౌరస్తాలు, రహదారుల విస్తరణ పనులు కార్యరూపం దాల్చకపోవటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిధులు కేటాయించి... కొలతలు కూడా జరిపిన అధికారులు... రెండెళ్లయినా పనులు ప్రారంభించకపోవటం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విస్తరణకు నోచుకోని రహదారులు... ట్రాఫిక్‌తో ఇబ్బందులు
రెండేళ్లు పూర్తయినా విస్తరణ పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోవడంలేదు. జిల్లాల పునర్విభజన అనంతరం కాగజ్‌నగర్ పట్టణాన్ని డివిజన్‌గా ఏర్పాటు చేశారు. సిర్పూర్ నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్ డివిజన్లోని ఏడు మండలాలకు చెందిన ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుండటం వల్ల ఆయా ప్రాంతాలు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి రహదారి విస్తరణ పనలు చేపట్టాలని తెలిపారు.