తెలంగాణ

telangana

ETV Bharat / state

వాగులు వంకలు దాటి.. అంబులెన్స్​ చేరి.. - గుండాలలో పురిటినొప్పులతో గర్భిణీ అవస్థలు

ఆమె నిండు గర్భిణీ. పైగా పురిటి నొప్పులు కూడా వస్తున్నాయి. ఆస్పత్రికి వెళ్లాలనుకుంది. కానీ తానుండేది ఏజెన్సీ ప్రాంతం. ఇంకా వర్షకాలం వస్తే ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తప్పవు. రోడ్లు గుంతలతో నిండిపోయి ఉంటాయి. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుంటాయి. ఆ ప్రవాహం దాటి వాహనాలు రాని పరిస్థితి. అయినా.. పట్టువదలకుండా ప్రవహిస్తున్న వాగు దాటి అంబులెన్స్​ వద్దకు చేరుకుంది గర్భిణీ సంధ్యారాణి.

వాగులు వంకలు దాటి.. అంబులెన్స్​ చేరి..
వాగులు వంకలు దాటి.. అంబులెన్స్​ చేరి..

By

Published : Jun 12, 2020, 6:39 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డకి చెందిన సంధ్యారాణి నిండు గర్భిణీ. తాను ఆస్పత్రికి వెళ్లేందుకు నానా అవస్థలు పడింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలం ప్రారంభమైతే.. అక్కడి గ్రామాల ప్రజలు పడే ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉంటాయి. అందుకు ఉదాహరణే వాగులో నడుచుకుంటూ వెళ్లిన గర్భిణీ సంధ్యారాణి.

సంధ్యారాణికి పురిటి నొప్పులు రావడం వల్ల ఆమెను గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బంధువులు మల్లన్న వాగు వద్దకు తీసుకొచ్చారు. వాగు అవతల వైపు అంబులెన్స్ ఉంది. వాగులో నీటి ప్రవాహం ఉన్నందున ఆంబులెన్స్ వచ్చే అవకాశం లేదు. దీంతో గర్భిణీని ఆమె కుటుంబ సభ్యులు వాగులో నడిపించుకుంటూ అంబులెన్స్ వద్దకు తీసుకెళ్లారు.

గుండాలలోని మల్లన్న వాగుపై తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడం వల్ల రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ప్రజలు ఆస్పత్రికి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మల్లన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలని గిరిజనులు వేడుకున్నారు.

అయితే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్​ ఎం.వి. రెడ్డి స్పందించారు. గర్భిణీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై ఆగ్రహించారు. వంతెన నిర్మాణ పనులపై నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు.

వాగులు వంకలు దాటి.. అంబులెన్స్​ చేరి..

ఇవీచూడండి: పోలీసుల అదుపులో ఎంపీ రేవంత్​రెడ్డి.. తీవ్ర ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details