లారీని పట్టుకుంటే షాక్ వచ్చింది.. - lorry
రహదారి పనుల్లో ఉన్న లారీకి విద్యుత్‌తీగలు తగిలి ఉన్నాయి. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న యువకుడు లారీని ఆనుకోగా విద్యుత్ఘాతానికి గుర్యయ్యాడు.
లారీతో షాక్
కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం అందెవేల్లి గ్రామంలో జరుగుతున్న రహదారి పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. పనుల్లో ఉన్న టిప్పర్ లారికి విద్యుత్ తీగలు తాకి ఉన్నాయి. పక్కనుంచి వెళ్తున్న రమేశ్ లారీకి ఆనుకుని వెళ్లాడు. ఈక్రమంలో అతను విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్థానికులు గమనించి వెంటనే అతన్ని కాగజ్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలించారు.