కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
పోలీసు వీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా రక్తదానం - కుమురం భీం జిల్లా వార్తలు
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రజల కోసం ప్రాణాలిచ్చి.. విధి నిర్వహణలో ఆదర్శంగా నిలిచిన పోలీసు అమరవీరులను గుర్తు చేసుకోవడం మన బాధ్యత అని జిల్లా అదనపు ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర అన్నారు.
పోలీసు వీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా రక్తదానం
పోలీసు వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని అదనపు ఎస్పీ సుధీంద్ర అన్నారు. కాగజ్‌నగర్ టౌన్ సీఐ మోహన్ రక్తదానం చేశారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పలువురు యువకులు సైతం రక్తదానం చేయడానికి ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ బీఎల్ఎన్ స్వామీ, కాగజ్ నగర్ టౌన్ సీఐ మోహన్, రూరల్ సీఐ నరేందర్, ఎస్సైలు తహిసినోద్దిన్, గంగన్న, సందీప్, రాంమోహన్, పోలీసు సిబ్బంది, డాక్టర్ విద్యాసాగర్ పాల్గొన్నారు.